https://oktelugu.com/

Tragedy: తల్లి లేని బతుకు తనకెందుకని తనువు చాలించాడు

Tragedy: అమ్మ ప్రేమకు కొలమానం లేదు. కొడుకు మీద తల్లికి అంతే ప్రేమ ఉంటుంది. నవమాసాలు మోసం కనిపెంచిన తల్లి మరణంతో అతడు తట్టుకోలేకపోయాడు. తల్లితోనే తనువు చాలించాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా శ్మశాన వాటికకు వెళ్లి తల్లిని ఖననం చేసిన చోటే ఉరేసుకుని మరణించాడు. దీంతో కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. తల్లి కొడుకు కుటుంబానికి దూరం కావడంతో జీర్ణించుకోలేకపోతున్నారు. కొడుకు చేసిన పనికి అందరు ఆశ్చర్యపోయారు. తల్లిదండ్రులన కడతేర్చే కొడుకులున్న నేటి కాలంలో కూడా తల్లి కోసం […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 14, 2022 / 03:20 PM IST
    Follow us on

    Tragedy: అమ్మ ప్రేమకు కొలమానం లేదు. కొడుకు మీద తల్లికి అంతే ప్రేమ ఉంటుంది. నవమాసాలు మోసం కనిపెంచిన తల్లి మరణంతో అతడు తట్టుకోలేకపోయాడు. తల్లితోనే తనువు చాలించాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా శ్మశాన వాటికకు వెళ్లి తల్లిని ఖననం చేసిన చోటే ఉరేసుకుని మరణించాడు. దీంతో కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. తల్లి కొడుకు కుటుంబానికి దూరం కావడంతో జీర్ణించుకోలేకపోతున్నారు. కొడుకు చేసిన పనికి అందరు ఆశ్చర్యపోయారు. తల్లిదండ్రులన కడతేర్చే కొడుకులున్న నేటి కాలంలో కూడా తల్లి కోసం తన ప్రాణాలను సైతం తృణప్రాయంగా భావించి ఆత్మహత్య చేసుకోవడం సంచలనం సృష్టించింది.

    Tragedy

    గోల్నాక శ్యామ్ నగర్ లో నివాసం ఉండే నాగేందర్, లక్ష్మిబాయి (60) భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు. పిల్లలు చిన్నతనంలోనే నాగేందర్ చనిపోయాడు. దీంతో తల్లి వారిని అల్లారు ముద్దుగా పెంచింది. వినోద్ కుమార్, విజయ్ కుమార్ ఇద్దరిని తల్లి పెంచి పెద్ద చేసింది. ఇందులో వినోద్ కుమార్ కు ఇంకా పెళ్లి కాలేదు. ఆటో డ్రైవర్ గా పనిచేస్తూ తల్లిని పోషిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తల్లికి క్యాన్సర్ సోకడంతో బుధవారం తనువు చాలించింది.

    దీంతో శ్మశాన వాటికలో అంత్యక్రియలు చేశారు. అమ్మలేని బాధను వినోద్ కుమార్ తట్టుకోలేకపోయాడు. తొమ్మిది మాసాలు పెంచి పోషించిన తల్లి అకాల మరణం చెందడంతో మనసులో బాధ పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో అంత్యక్రియలు జరిగినా అతడిలో మాత్రం వేదన పోలేదు. చివరకు తన ప్రాణాలు తీసుకోవాలని భావించాడు.అమ్మలేని జీవితం ఇక కుదరదని అనుకున్నాడు. తల్లిలేని నన్ను ఎవరు చూస్తారని కుమిలిపోయాడు. ఇక బతకడం వృథా అనే కోణంలో ఆలోచించాడు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయాడు. బంధువులంతా వెతికినా ఎక్కడా కనిపించలేదు. ఈ క్రమంలో అనుమానం వచ్చిన అందరు శ్మశాన వాటికకు వెళ్లి చూడగా తల్లిని ఖననం చేసిన చోటే రేకుల షెడ్డులో ఉరేసుకుని చనిపోయి ఉన్నాడు. దీంతో అందరు రోదించారు.Also Read: TRS: ట్విట్టర్ ట్రెండింగ్స్‌ను చూసి మురిసిపోతున్న టీఆర్ఎస్.. ఇది సరిపోతుందా..?

    Tags