TRS: తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ఇటీవల కాలంలో సోషల్ మీడియా యాక్టివిటీస్ బాగా పెంచింది. ఇటీవల రైతు బంధు సంబురాల పేరిట పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు. ఇక టీఆర్ఎస్ యువనేత కేటీఆర్ ‘ఆస్క్ కేటీఆర్’ పేరిట ట్విట్టర్ వేదికగా పలు సమస్యలపైన స్పందిస్తున్నారు.అలా మొత్తంగా టీఆర్ఎస్ వ్యూహకర్తలు సోషల్ మీడియాపైన ఫుల్ ఫోకస్ పెట్టినట్లు స్పష్టమవుతోంది.
రైతు బంధు సంబురాల పేరిట టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఎంపీలు, పార్టీ నాయకులు అందరూ క్షేత్రస్థాయిలో హడావిడి చేశారు. ఎడ్ల బండ్లతో ఊరేగింపులు, కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు. వ్యవసాయానికి కేసీఆర్ సర్కారు ఇస్తున్న ప్రయారిటీ గురించి ప్రస్తావిస్తూ హంగామా చేస్తున్నారు.అయితే, ఇలా చేయడం ద్వారా టీఆర్ఎస్ పార్టీ మరింత్ర స్ట్రాంగ్ అవుతుందనే అభిప్రాయం మేరకు ఇలా చేస్తున్నారనే అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది.ట్విట్టర్ ట్రెండింగ్‌లోకి రావడం, హంగామా చేయడం ద్వారా గులాబీ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజం వస్తుందని అనుకుంటున్నారు.
Also Read: తెలుగుతనం ఉట్టిపడేలా పంచెకట్టులో జగన్..భోగి సంబురాల్లో ఏపీ సీఎం..
ఎంత హంగామా చేసినప్పటికీ క్షేత్ర స్థాయి పరిస్థితులను పట్టించుకోకుండా వ్యవహరిస్తే పార్టీ బలోపేతం కాదని ఈ సందర్భంగా పలువురు సూచిస్తున్నారు.సోషల్ మీడియాలో ప్రచారార్భాటాల కంటే కూడా క్షేత్రస్థాయిలో సంక్షేమ పథకాలు అమలు, తీరుతెన్నులపైన స్పెషల్ ఫోకస్ పెట్టాలని చెప్తున్నారు.గ్రౌండ్ లెవల్ లో ప్రజల సమస్యల పరిష్కారానికి చొరవ చూపినట్లయితే ఆటోమేటిక్ గా టీఆర్ఎస్ తిరుగు లేని రాజకీయ శక్తి అవుతుందని అంటున్నారు.
ఇకపోతే ఓ వైపు రైతు బంధు సంబురాలు జరుపుకుంటున్న క్రమంలో కొందరు ‘ఆస్క్ కేటీఆర్’ లో భాగంగా కొందరికీ ఇంకా రైతు బంధు డబ్బులు పడలేదని తెలిపారు.కాగా, ఈ విషయం నిజమేనని, పలు కారణాల చేత ఇంకా డబ్బులు వేయలేదని, త్వరలో అందజేస్తామని, అకౌంట్లలో డబ్బుల పడతాయిన కేటీఆర్ తెలిపారు.అలా ప్రజల నుంచి ఎప్పటికప్పుడు కంప్లయింట్స్ తీసుకుని సమస్యలను పరిష్కరిస్తే కనుక ప్రభుత్వానికి ఇంకా మంచి పేరు వస్తుందని అంటున్నారు. మరో వైపున ఫెడరల్ లేదా తృతీయ ఫ్రంట్ కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్న సంగతి అందరికీ విదితమే.
Also Read:బన్నీని టచ్ చేయడం పవన్ కి కూడా కష్టమే…కానీ చరణ్ కి కాదు!