
దేశంలో సీసీ కెమెరాల ఏర్పాటులో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత ఏర్పడిన టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రాష్ట్రం ప్రశాంతంగా ఉందన్నారు. ఎలాంటి అల్లర్లు, కర్ఫ్యూ లేదన్నారు. టీఆర్ఎస్ ను విమర్శించేవారు ఆలోచించాలన్నారు. ఆరేళ్లలో టీఆర్ఎస్ ఎంతో అభివ్రుద్ధి చేసిందన్నారు. హైదరాబాద్ లో శాంతి భద్రతలు పటిష్టంగా ఉన్నాయన్నారు. ఆరేళ్లకు ముందు హైదరాబాద్ లో మత కల్లోలాలు, అశాంతి నెలకొని ఉందని, టీఆర్ ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఒక్క విధ్వేష సంఘటన జరగలేన్నారు. ప్రజలు, ప్రతిపక్షాలు సైతం వాస్తవాలను గమనించాలన్నారు. అనవసరంగా టీఆర ఎస్ పై నిందలు వేయద్దన్నారు.