
వానకాలంలో మొక్కజొన్న పంట సాగు చేసి వ్యవసాయ అధికారుల వద్ద ఆన్లైన్లో నమోదు చేసుకోనటువంటి మొక్కజొన్నలను ప్రభుత్వమే కొనుగోలు చేసేందుకు అనుమతి మంజూరైందని, రైతులు ఆందోళన చెందవద్దని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆన్లైన్లో నమోదు చేసుకున్న వారివే మొక్కజొన్నలు కొనుగోలు చేస్తున్నారనే విషయం రైతులు తన దృష్టికి తీసుకవచ్చారని తెలిపారు.