
రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చి అదుపుతప్పి రెండు దుకాణాల్లోకి దూసుకెళ్లింది. దుకాణంలో వేడి నూనె మీదపడి నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. కారు దుకాణాల వైపు దూసుకొస్తుండటాన్ని గుర్తించిన అక్కడున్న వారు పక్కకు పరుగులు తీయడంతో ప్రాణనష్టం తప్పింది. కారు నడిపిన మహిళ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయింది. పోలీసులు కారును సీజ్ చేసి ఘటనకు గల కారణాలపై విచారణ నిర్వహిస్తున్నారు.