
భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. మహ్మద్ అబ్దుల్ అజీం రైతువేదిక భవన నిర్మాణ పనులను పరిశీలించేందుకు తన కారులో రేగండ మండలానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో రామన్నగూడెం తండా సమీపంలో ఓ ద్విచక్రవాహనదారుడు అడ్డు రావడంతో కలెక్టర్ వాహనం డ్రైవర్ అప్రమత్తమై తప్పిందచుకు ఒక్కసారిగా బ్రేక్ వేసి పక్కకు తీసుకెళ్లాడు. దీంతో కలెక్టర్‌తో సహా వాహనంలో ఉన్నవారందరూ సరక్షితంగా బయటపడ్డారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించగా వాహనదారుడిని అదుపులోకి తీసుకున్నారు. మావోల ప్రభావం ఉన్న జిల్లా కావడంతో ఈ సంఘటనతో ఒక్కసారిగా కలకలం రేపింది.