
నగరంలో అక్రమంగా నివసిస్తున్న రోహింగ్యాలు, సంఘ విద్రోహశక్తులను గుర్తించాలంటే రాష్ట్ర ప్రభుత్వం పోలీసులకు పూర్తి స్వేచ్ఛనివ్వాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కోరారు. అలా చేస్తే కొన్ని గంటల వ్యవధిలోనే పోలీసులు వారిని గుర్తించి అరెస్టు చేస్తారన్నారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. పాతబస్తీలో ఉన్న రోహింగ్యాలను గుర్తించడంలో తెరాస ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే సత్వరమే రోహింగ్యాలు, సంఘ విద్రోహశక్తుల విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు.