తెలంగాణలో వ్యవసాయేతర ఆస్తులపై విధివిధానాలు, మార్గదర్శకాలపై మంత్రి వర్గం ఉప సంఘం భేటీ అయింది. వ్యవసాయ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహిస్తున్నఈ సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, మహూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. ధరణి ద్వరా ప్రారంభైన వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఈనెల 14వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా తొలిరోజు కేవలం 82 రిజిస్ట్రేషన్లు మాత్రమే జరిగాయి. స్లాట్ బుకింగ్ కోస ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో మంత్రి వర్గం ఉప సంఘం భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.