
తెలంగాణ రాష్ట్ర కేబినేట్ శనివాం సమావేశం కానుంది. రాష్ట్రంలో యాసంగి పంటల సాగు విధానం, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లపై ప్రగతిభవన్‌లో వ్యవసాయ, పౌరసరఫరాల శాఖ అధికారులతో సమావేశం కానున్నారు. కరోనా ముప్పు ఇంకా తొలిగిపోనందున గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించే అవకాశం ఉంది. దీనికి అనుగుణంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసేలా ఆదేశాలు జారీ చేయవచ్చు. కేంద్రం పెద్ద ఎత్తున మక్కలను దిగుమతి చేసుకుంటుండడంతో మక్కల కొనుగోలుపై ప్రభావం చూపనుండడంతో మక్కల సాగుపై నిర్ణయం తీసుకనే అవకాశం ఉంది.