
వరదసాయంపై కేసీఆర్ కు సవాల్ విసిరిన నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ శుక్రవారం చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయానికి చేరుకున్నారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే శుక్రవారం కావడంతో ఇక్కడ రద్దీ ఎక్కువగా ఉంది. దీంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. వరద సాయంపై తాను లేఖ రాశానని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నాడని, దానిపై తేల్చుకోవడానికి ఇక్కడికి రావాలని మరోసారి అన్నారు. ఉదయం నుంచి ఈ ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొనడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఒక దశలో ఆయనను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.