
తెలంగాణ ప్రభుత్వం నేటి నుంచి రైతు బంధు నగదును బదిలీ చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా 1.52 కోట్ల ఎకరాలకు రూ.7,515 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ముందుగా ఎకరం లోపు భూమి ఉన్నవారికి నగదు బదిలీ చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా 61.49 లక్షల మందికి రూ.5000ల చొప్పున సోమవారం నుంచి 10వేల చొప్పను రైతుల ఖాతాదారుల్లోకి నగదు పడనుంది. జనవరి 7 వరకు సాగే ఈ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే రూ.7,300 కోట్లను విడుదల చేసింది. ఇవాళ ముందుగా ఎకరం భూమి లోపు ఉన్నవారికి, ఆ తరువాత రెండెకరాల లోపు ఉన్నవారిగా విడతల వారీగా నగదు పంపిణీ చేయనున్నారు.