
తెలంగాణ సర్కార్ డిసెంబర్ 28 నుంచి రైతుబంధు సాయాన్ని అందిస్తోంది. యాసంగి రైతు బంధు కోసం 7800 కోట్లను ప్రభుత్వం విడుదల చేయనుంది. జనవరి 7వరకు విడతల వారీగా అందిస్తారు. డిసెంబర్ 28న మొదట ఎకరంలోపు ఉన్న రైతులకు సాయం అందుతుంది. ఆ తర్వాత రెండు ఎకరాలు ఉన్నవారికి.. ఆపై మూడు ఎకరాలలోపు పొలం ఉన్న వారికి విడతల వారీగా నగదు బదిలీ చేస్తారు. జనవరి 7 నాటికి రైతులందరికీ నగదు సాయం అందుతుంది. 57.90 లక్షలమంది రైతులకు 7251 కోట్ల రైతు బంధు అందిస్తారు. అదనంగా ఈసారి 1.70 లక్షలమంది రైతులు చేరారు.