
తెలంగాణ రాజకీయాలు ఢిల్లీ చుట్టు తిరుగుతున్నాయి. బుధవారం ఢిల్లీకి ఎంపీ రేవంత్‌రెడ్డి వెళ్లనున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు డిఫెన్స్ కమిటీ సమావేశంలో ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ, రేవంత్‌రెడ్డి పాల్గొననున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నూతన సారధి ఎంపిక ఆపార్టీ నేతల్లో ఉత్కంఠ రేపుతోంది. పీసీసీ అధ్యక్షుడి ఎంపిక కోసం కసరత్తు జరుగుతున్న వేళ రేవంత్ ఢిల్లీ పర్యటనపై ఆసక్తి రేపుతోంది. తెలంగాణ పీసీసీ చీఫ్ రేసులో మొదటిగా వినిపిస్తున్న పేరు రేవంత్ రెడ్డి. ఇటీవల టీపీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణకు కొత్త రథసారధిని నియమించే పనిలో అధిష్టానం దృష్టి పెట్టింది. ఈ మేరకు ఏఐసీసీ కసరత్తు ప్రారంభించింది.