
అన్నిశాఖల్లో ఖాళీలను గుర్తించి ఫిబ్రవరి నుండి ఉద్యోగ నియామకాల ప్రక్రియను చేపట్టాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఖాళీల అధ్యయనానికి ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధ్యక్షుడిగా ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ సభ్యులుగా త్రిసభ్య అధికారుల సంఘాన్ని సీఎం నియమించారు. ఈ కమిటీ జనవరి మొదటివారంలో వేతన సవరణ సంఘం నుండి అందిన నివేదికను అధ్యయనం చేయనుంది. రెండోవారంలో ఉద్యోగ సంఘాలతో సమావేశం అవుతుంది.