
చించోలి సమీపంలోని గండి రామన్న హరిత వనం పార్కులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పార్కులోకి మూషిక జింకలను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వదిలిపెట్టనున్నారు. అర ఎకరం విస్తీర్ణంలో రూ. 8 లక్షల వ్యయంతో మూషిక జింకల పార్కును ఏర్పాటు చేశారు. వాటి కోసం ప్రత్యేకంగా ఎన్‌క్లోజర్లను ఏర్పాటు చేశారు. ఒకటి మగ, మూడు ఆడ మూషిక జింకలను పార్కులో వదిలిపెట్టనున్నారు. మూషిక జింకల పునరుత్పత్తి కోసం అటవీ శాఖ అధికారుల ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పునరుత్పత్తి తర్వాత వాటిని అడవులలోకి వదిలివేస్తారు.నెహ్రూ జూపార్క్‌లో మూషిక జింకల పునరుత్పత్తి కేంద్రం నుంచి వీటిని ఇక్కడకు తీసుకు వస్తున్నారు.