
భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. ఈ నేపథ్యంలో నేడు, రేపు రెండు రోజులపాటు సెలవులను ప్రకటించింది తెలంగాణ రాష్ట్రప్రభుత్వం. అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించింది.పిల్లలు, వృద్ధులను జాగ్రత్తగా చూసుకోవాలని తెలిపింది. పాత భవనాల్లో ఉన్నవారు తక్షణమే ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని తెలిపాంది. ఏదైనా అవసరం కోసం రాష్ట్రవ్యాప్తంగా హెల్ప్‌లైన్లను ఏర్పాటు చేశామని, ఫోన్‌లో సంప్రదించాలని ప్రభుత్వ అధికారులు తెలిపారు. మరోవైపు రాష్ట్ర మంత్రి కేటీఆర్ వర్షాలపై సమీక్ష నిర్వహించారు. జీహెచ్‌ఎంసీలో అధికారులు, మేయర్‌లు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో ఉండి పరిస్థితిని సమీక్షించాలని కోరారు. అవసరమైన చోట వైద్య సదుపాయాలు అందించాలన్నారు.