
వరద సాయంపై లేఖ విషయంలో నిజనిజాలు తేల్చేందుకు శుక్రవారం చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరకు రావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కేసీఆర్ కు సవాల్ విసిరారు. తాను మధ్యాహ్నం 12 గంటలకు అక్కడికి చేరుకుంటానన్నారు. అయితే బండి సంజయ్ ని అక్కడకు చేరుకోనీయకుండా పోలీసులు ఆయనన అదుపులోకి తీసుకునేందుకు సిద్ధమయ్యారు. కాగా ప్రస్తుతం సంజయ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో ఏ క్షణమైనా చార్మినార్ దగ్గకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్న పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. వరదసాయాన్ని నిలిపివేయాలని బీజేపీ నాయకులు కేంద్ర ఎలక్షన్ కమిషనర్ కు లేఖ రాశారని, అందుకే రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ వరదసాయాన్ని ఆపేశారని కేసీఆర్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బండి సంజయ్ సవాల్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.