
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మంగళవారం నిర్వహించే భారత్‌బంద్‌లో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. వెస్ట్ మారేడ్‌పల్లిలోని తన నివాసంలో సనత్‌నగర్ నియోజకవర్గ తెరాస పార్టీ జనరల్ బాడీ సమావేశం నిర్వహించిన మంత్రి మాట్లాడారు. మంగళవారంఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు నిర్వహించే బంద్‌కు వ్యాపార, వాణిజ్య సంస్థలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.