
తెలంగాణలో కురిసిన భారీ వర్షంపై ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం మధ్యాహ్నం అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 9 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, 70 మందికి పైగా మృతి చెందారని గుర్తించారు. హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున రోడ్ల డ్యామేజీ జరిగిందని, విద్యుత్‌శాఖకు తీవ్ర నష్టం కలిగిందని అధికారులు నివేదికలు సమర్పించారు. దీనిని జాతీయ విపత్తుగా భావించి కేంద్రాన్ని రూ. 5 కోట్ల మేర సాయం కావాలని కోరాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.