
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో సాయంత్రం 5 గంటల నుంచి మద్యం దుకాణాలను మూసివేయనున్నారు. తిరిగి డిసెంబర్ 1వ తేదీన సాయంత్రం 6 గంటలకు తెరుస్తారు. ఆరోజున పోలింగ్ ఉండడంతో ఎన్నికల నిబంధనల ప్రకారం మద్యం దుకాణాలు 48 గంటల ముందే మూసివేయనున్నారు. ఎక్కడా మద్యం అమ్మాకాలు నిర్వహించకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. కాగా నేటితో ప్రచారం ముగియనున్నందు ఆయా పార్టీలు ప్రచారాన్ని జోరు పెంచాయి. నిన్న టీఆర్ఎస్ తరుపున కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించడంతో ఆ పార్టీ నేతల్లో ఊపు తెచ్చింది. నేడు బీజేపీ తరుపున అమిత్ షా రోడ్ షో నిర్వహించనున్నారు.