
హైదరాబాద్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా టీఆర్ఎస్ పార్టీ శనివారం నుంచి ప్రచారాన్ని ప్రారంభించనుంది. ఇందులో భాగంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షోలో పాల్గొననున్నారు. నగరంలోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో నిర్వహించే రోడ్ షోలో కేటీఆర్ పాల్గొంటారు. అలాగే రేపు మహేశ్వరం, ఎల్బీనగర్ నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. మరోవైపు ఈనెల 28న ఎల్బీ స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొంటారు. టీఆర్ఎస్ తరుపున మంత్రులు హరీశ్రావు, తలసాని శ్రీనివాసయాదవ్, ఇతర ఎమ్మల్యేలు ప్రచారంలో పాల్గొననున్నారు. ప్రచారానికి ఎక్కువ సమయం లేనందుకు ఉన్న కొద్ది సమయంలో ఉద్రుతం చేయునున్నారు. ఈ మేరకు పార్టీ ప్రచార ప్రణాళికను ఇప్పటికే సిద్ధం చేసింది.