తెలంగాణలో వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ల ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం సమీక్ష చేయనున్నారు. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో తీసుకునే నిర్ణయంపై సమావేశంలో చర్చించనున్నారు. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లలో ‘యూజర్ మాన్యువల్ ’పేజీలో ఉన్న ఆధార్ కార్డు కాలమ్ ను తొలగించాలని, అప్పటి వరకు స్లాట్ బుకింగ్ నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. యూజర్ మాన్యువల్ లో ఆధార్కు సంబంధించిన ప్రస్తావనను తొలగించే వరకు స్లాట్ బుకింగ్, ఆస్తిపన్ను నెంబర్ కోరే వారిని ఆధార్ సమాచారం ఇవ్వాలని ప్రభుత్వం ఒత్తిడి చేయదాదని పేర్కొంది.
ఈ నేపథ్యంలో సోమవారం నుంచి పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేయాలని ప్రభుత్వం అంగీకరించింది. ఇప్పటివరకు స్లాట్ బుకింగ్ చేసుకున్న వారికి అదే పద్ధతిలో కొనసాగించాలంది. దీంతో రిజిస్ట్రేషన్ విషయంలో మార్పులు చేద్దామా..? అనే ఆలోచనల నేపథ్యంలో నేటి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. శనివారం నిర్వహించాల్సిన ఈ సమావేశం ఆదివారానికి వాయిదా పడింది. ప్రగతిభవన్ లో నిర్వహించే ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు ఉన్నతాధికారులు పాల్గొనున్నారు.