తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రయోగాలు ఫెయిల్ అయిపోతున్నాయి. ప్రజాశ్రేయస్సు కోసం అంటూ ఆయన చేస్తున్న పనులు ప్రజలకు ఇబ్బందులు కలుగ చేస్తున్నాయి. దీంతో హైకోర్టుల్లో ఎదురుదెబ్బలు తప్పడం లేదు. ఈ క్రమంలోనే భూరిజిస్ట్రేషన్ల ప్రక్రియలో లోపాలపై హైకోర్టు ఇటీవల ఆదేశాల మేరకు కేసీఆర్ ‘ధరణి’ వెబ్ సైట్ ను పక్కనపెట్టేశారు. తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ రోజు నుంచి పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లను చేసేందుకు రిజిస్ట్రేషన్ల శాఖ చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు ఉత్తర్వులు జారీ చేశారు.స్లాట్ బుకింగ్ అవసరం లేకుండా.. ఆధార్ వివరాలతో నిమిత్తం లేకుండా హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా సోమవారం నుంచి తెలంగాణలో వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లను పాత పద్ధతిలోనే ప్రారంభించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Also Read: తెలంగాణలో కేసీఆర్ ఎక్కడ ఫెయిల్ అవుతున్నాడో తెలుసా?
హైకోర్టు ఆదేశాలతో రిజిస్ట్రేషన్ ప్రక్రియలో తెలంగాణ సర్కార్ మార్పులు చేసింది. ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలుగకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ధరణిపై హైకోర్టు తీవ్ర అభ్యంతరాలు తెలుపుతుండటం.. దీంతో స్లాట్స్ బుకింగ్ కూడా నిలిపివేయమని ఆదేశించడంతో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
హైకోర్టు ఆదేశాల మేరకు ‘ధరణి’ వెబ్ సైట్ భూ రిజిస్ట్రేషన్లపై వెనక్కి తగ్గాల్సిన పరిస్తితులు ఏర్పడ్డాయి. దీంతో తాజాగా తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైకోర్టు ఉత్తర్వులపై తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఆదివారం దీనిపై అధికారికంగా సమావేశమై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.
Also Read: రిజిస్ట్రేషన్లు ఇకపై పాత పద్ధతిలోనే..!
దాదాపు నెలన్నరగా తెలంగాణలో భూ రిజిస్ట్రేషన్లు నిలిచిపోయి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే పాత పద్ధతిలోనే ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేయాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయించింది. ముందస్తు స్లాట్ బుకింగ్ లు కూడా రద్దు చేస్తున్నట్టు సీఎస్ సోమేష్ కుమార్ తెలిపారు. ఇప్పటికే స్లాట్ బుకింగ్ చేసుకొని ఉంటే వారికి కేటాయించిన తేదీల్లోనే రిజిస్ట్రేషన్ చేస్తారు.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్