
తెలంగాణలో అట్టడుగు వర్గాల అభ్యున్నది కోసం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు కృషి చేస్తున్నారని మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. అణగారిన వర్గాలను పైకి తీసుకు వచ్చేందుకు పలు పధకాలు ఎంతో ఉపయోగపడుతున్నాయన్నరు. అన్నిమతాలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం సమానంగా గౌరవిస్తుందన్నారు. ఆదివారం పెగడపల్లి మండలం ఎంపీడీవో కార్యాలయంలో క్రైస్తవులకు గిఫ్ట్ ప్యాక్‌లను మంత్రి పంపిణీ చేశారు.