దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక మాసం సోమవారం నుంచి ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఆలయాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. గత కొన్ని నెలలుగా కరోనా కారణంగా ఆలయాలు మూసి ఉంచడంతో భక్తులు గుళ్ల వైపు చూడలేదు. ఆ తరువాత అన్ లాక్ మార్గదర్శకాల ప్రకారం ఆలయాలు తెరుచుకున్నా భక్తలు కొద్ది సంఖ్యలో మాత్రమే వస్తున్నారు. తాజాగా కరోనా కేసులు భారీగా తగ్గడంతో పాటు భక్తులు అత్యంతగా ఇష్టపడే కార్తీక మాసం కావడంతో ఆలయాల్లో భక్తుల రద్దీ పెరుగుతోంది. సోమవారం ప్రముఖ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తులు పుణ్యస్నానాలు చేశారు. అనంతరం స్వామివారిని కోవిడ్ నిబంధనల ప్రకారం దర్శించుకున్నారు.అటు ఆంధ్రప్రదేశ్ లోని శైవక్షేత్రాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం పంచరామ క్షేత్రం, ఉమాసోమేశ్వర జనార్ధన స్వామి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు.