https://oktelugu.com/

నేడు జవాన్ మహేశ్ అంత్యక్రియలు

జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదుల తూటాలకు బలైన మహేశ్ మృతదేశం స్వగ్రామానికి చేరింది. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కోమన్ పల్లికి చెందిన ర్యాడ మహేశ్ గత అదివారం జమ్మూకాశ్మీర్ లో ఉగ్రపోరులో మరణించారు. మహేశ్ మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. సీఎం కేసీఆర్ మహేశ్ కుటుంబానికి అండగా ఉంటానన్నారు. పవన్ కల్యాణ్ ఆ వీరులు చేసిన సేవలు మరువలేనివన్నారు. తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. అయితే మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత మహేశ్ మృత […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : November 11, 2020 / 09:16 AM IST
    Follow us on

    జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదుల తూటాలకు బలైన మహేశ్ మృతదేశం స్వగ్రామానికి చేరింది. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కోమన్ పల్లికి చెందిన ర్యాడ మహేశ్ గత అదివారం జమ్మూకాశ్మీర్ లో ఉగ్రపోరులో మరణించారు. మహేశ్ మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. సీఎం కేసీఆర్ మహేశ్ కుటుంబానికి అండగా ఉంటానన్నారు. పవన్ కల్యాణ్ ఆ వీరులు చేసిన సేవలు మరువలేనివన్నారు. తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. అయితే మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత మహేశ్ మృత దేహం స్వగ్రామానికి చేరుకోవడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. సతీమణి సుహాసిని, తల్లిదండ్రలు రాజులు, గంగమల్ల కన్నీటి సంద్రదమయ్యారు. కాగా బుధవారం మహేశ్ అంత్యక్రియలు జరగనున్నాయి.