
గజ్వేల్‌లో 100 పడకల ఆస్పత్రి పూర్తయి రెండుళ్లు అవుతుంటే దుబ్బాకలో ఎందుకు పూర్తి కావడం లేదని ప్రభుత్వాన్ని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ప్రశ్నించారు. దుబ్బాకపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని మండిపడ్డారు. సిద్దిపేట మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవానికి తనను పిలవలేదన్నారు. మెడికల్ కాలేజీలో సీట్లు సిద్దిపేట నియోజకవర్గం వారికే ఇస్తారా? అని జడ్పీ సమావేశంలో ఆయన ప్రశ్నించారు.