
నిజామాబాద్ వర్ని మండలం జాకొరా ప్రాంతంలో తుపాకుల కలకలం రేగింది. వర్ని అటవీ ప్రాంతంలో హైదరాబాద్ ఫారెస్ట్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు చేసారు. సుమారు 5 గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న అధికారులు, రెండు వేట తుపాకుల స్వాధీనం చేస్తున్నారు. లైసెన్స్ తుపాకులు అయి వుంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. వర్ని అటవీ ప్రాంతంలో వేటకు వెళుతున్నారని అనుమానిస్తున్న హైదరాబాద్ స్పెషల్ ఫారెస్ట్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, ఒక కారు అటవీ జంతువుల మాంసం స్వాధీనం చేసుకున్నారు. 2 తుపాకులు,5 గురు వ్యక్తులను నిజామాబాద్ జిల్లా ఫారెస్ట్ అధికారులకు అప్పగించి వెళ్ళిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.