
ప్రజలకు బీజేపీ నాయకులు తప్పుడు సమాచారం ఇస్తున్నారని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. శుక్రవారం దుబ్బాకలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ నేతల ఇళ్లల్లో డబ్బులు దొరికితే పోలీసులే డబ్బులు పెట్టినట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారన్నారు. అబద్దాల పునాదులపై దుబ్బాకలో గెలవాలని ప్రయత్నిస్తోందని, తెలంగాణకు ఉపయోగపడే ఒక్క ప్రాజెక్టయినా బీజేపీ చేసిందా..? అని ఆయన ప్రశ్నించారు.