Homeతెలంగాణ బ్రేకింగ్ న్యూస్తుంగభధ్ర పుష్కరాలకు నిధులు విడుదల

తుంగభధ్ర పుష్కరాలకు నిధులు విడుదల


తుంగభధ్ర పుష్కరాలకు రూ.2.50 కోట్ల నిధులను తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. వచ్చే నెల 1 నుంచి జరిగే తుంగభద్ర పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం ఆయన సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాట్లు చేస్తోందన్నారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పుష్కరాలు నిర్వహిస్తున్నందున భక్తులు కూడా భౌతిక దూరం పాటిస్తూ ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలన్నారు. పుష్కర ఘాట్ల వద్ద సాంప్రదాయ పూజలు చేసుకోవచ్చన్నారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular