హైదరాబాద్ లోని కురిసిన భారీ వర్షాలకు పలు ప్రాంతాలు దెబ్బతిన్నాయి. ప్రాణ నష్టంతో పాటు ఆస్తినష్టం సంభవించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం తక్షణమే రూ.550 కోట్లు ప్రకటించింది. అయితే వరదసాయం పంపిణీలో అవకతవకలు ఏర్పడిన తరుణంలో ఆ సాయాన్ని నిలిపివేశారు. దీంతో వరదసాయంపై గత కొన్ని రోజులుగా ఆందోళనలు జరగుతున్నాయి. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ వరద ప్రభావిత ప్రాంతంలో నష్టం వాటిల్లితే మీ సేవా సెంటర్లలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మీసేవ సెంటర్లలో తమ వివరాలు అందిస్తే సంబంధిత అధికారులు సర్వే చేసి వరదసాయాన్ని అందిస్తారన్నారు. అయితే వరద సాయం కోసం దళారులను నమ్మొద్దన్నారు.