
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో బుధవారం నిత్యపూజలు ఘనంగా జరిగాయి. ఉదయం సుప్రభాతంతో మేల్కొలిపిన అర్చకులు స్వయంభులకు, బాలాలయ కవచమూర్తులకు ఆరాధనలు జరిపి ఉత్సవ మండపంలో ఉత్సవ విగ్రహాలను పంచామృతాలలో అభిషేకించి, తులసి అర్చనలు జరిపారు. లక్ష్మీ నరసింహులను దివ్య మనోహరంగా అలంకరించి శ్రీసుదర్శన హోమం, లక్ష్మీ నరసింహుల కల్యాణం, అలంకార సేవోత్సవాలు నిర్వహించారు.