
నాగార్జున సాగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య ముగిశాయి. ప్రభుత్వ లాంఛనాలతో నోముల అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల్లో ముఖ్యమంత్రి కేసీఆర్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, మంత్రులు మహముద్ అలీ, జగదీశ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొని నివాళులర్పించారు. సీఎం కేసీఆర్ నోముల నరసింహయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు.