
తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన డబుల్ బెడ్ రూం పథకంపై ప్రభుత్వం ద్రుష్టి సారించింది. ఈ పథకంలో భాగంగా ఇప్పటికే పూర్తయిన ఇళ్లను ప్రారంభించారు. ఇటీవల సిద్ధపేటలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రారంభించారు. బుధవారం హైదరాబాద్ లోని వ్యవస్థలిపురం రైతు బజార్ వద్ద నిర్మంచిన డబుల్ బెడ్ రూం ఇళ్లను రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. రెండు ఎకరాల విస్తీర్ణంలో 324 డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించారు. వీటి కోసం ప్రభుత్వం రూ.28.02 కోట్లు వెచ్చించింది. మరి కాసేపట్లో ఈ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన పత్రాలు అందించనున్నారు.