
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రహదారి భద్రతా చర్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమశ్‌కుమార్ ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలుతగ్గించడానికి తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. జాతీయ హదారులు, ఆర్‌అండ్‌బి, పంచాయితీరాజ్, జీహెచ్‌ఎంసి తదితర ఇంజనీరింగ్ విభాగాలు వచ్చే నెల 15వ తేదీలోగా ప్రమాదాల నివారణకు సంబంధించి అవసరమైన తాత్కాలిక చర్యలను పూర్తిచేయాలని సీఎస్ ఉన్నతాధికారులను ఆదేశించారు.