
స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద వరంగల్‌కు రాష్ట్ర ప్రభుత్వం వాటా నుంచి ఇవ్వాల్సిన రూ.83కోట్లలో ఇంతవరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని కేంద్రహోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. వరంగల్ స్మార్ట్‌సిటీ ప్రాజెక్టుకు రూ.2,740కోట్లతో ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని చెప్పారు. అందులో తొలివిడతగా రూ.576కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు పూర్తికార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు.