జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ చెదురుమదురు ఘటనల మధ్య కొనసాగుతోంది. అయితే పోలింగ్ గుర్తులు తారుమారు కావడంతో ఓల్డ్ మలక్పేటలో పోలింగ్ రద్దు చేశారు. కంకి కొడవలి(సీపీఐ)కి బదులు సుత్తి కొడవలి(సీపీఎం) గుర్తును ముద్రించారు. దీనిపై సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి అభ్యంతరం చెప్పడంతో ఎన్నికల కమిషన్ దానిని పరిశీలించింది. దీంతో పోలింగ్ ను నిలిపివేసింది. అయితే గురువారం రీపోలింగ్ పెట్టే అవకాశం ఉంది. కాగా ఉదయం 11 గంటలకు 8.9 శాతం పోలింగ్ నమోదైంది. అక్కడక్కడా స్వల్ప ఉద్రిక్తలు చోటు చేసుకుంటున్నాయి.