
ఒకవేళ కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే ముందుగా వైద్య సిబ్బందికే ఇస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆదివారం ఆయన కరోనా పరిస్థితులపై వైద్యారోగ్యశాఖ అధికారులతో సమీఓించారు. ఈ సందర్భంగా మాట్లాుడుతూ కరోనా కేసులు మళ్లీ పెరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలు జాగ్రత్తలు పాటించడం తప్ప మరో మార్గం లేదన్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయన్నారు. కరోనా చికిత్స కోసం రాష్ట్రంలో 10 వేల ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇతర రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్న ద్రుష్ట్యా రాష్ట్రంలో కూడా అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.