
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 2,072 కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్యశాఖ బులిటెన్ ద్వారా తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,89,283కు చేరింది. అలాగే నిన్న 9 మంది మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 1,116గా ఉంది. ఇక 54,308 మందికి కరోనా పరీఓలు చేయగా 29,477 మంది చికిత్స పొందుతున్నారు. 23,934 మంది హోం ఐసోలేషన్‌లో ఉంటున్నారు. ప్రస్తుతం తెలంగాణలో మరణాల రేటు 0.58 శాతం ఉందని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది.