
కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి బీజేపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ దీనావస్థకు చేరుతోంది. మరోవైపు బీజేపీ బలపడుతోంది. ఇటీవల దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన విషయం తెలిసిందే. మరోవైపు జీహెచ్ఎంసీలో సగం దాదాపు 48 సీట్లలో గెలుపొందింది. ఇదిలా ఉండగా ఇటీవల నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య మరణించారు. దీంతో అక్కడ ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంది. 2018 ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి పోటీ చేసిన జానారెడ్డి నోముల నర్సింహ్మయ్యపై ఓడిపోయారు. తాజాగా ఉప ఎన్నిక జరగునుండడంతో ఆయన బీజేపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన ఇప్పటికే బీజేపీతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం.