
పదవులు మనకు వన్నె తేవని మన పని తీరుతో పదవికే వన్నె తీసుకు రావాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రైతులకు నూతన పాలకవర్గం సరైన న్యాయం చేయాలని కోరారు. మహబూబ్ నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా అమరేందర్ రాజు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతు సంక్షేమం కోసం కృషి చేయాలని..నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు లేకుండా చూసేందుకు పాలకవర్గం కృషి చేయాలని మంత్రి కోరారు.