
ప్రేమ, శాంతి , కరుణ, దయలకు ప్రతిరూపమే క్రైస్తవమని ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సేవ చేయడమే పరమావధిగా అనేకమంది క్రైస్తవులు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని తెలిపారు. గత మార్చిలో వచ్చిన కరోనా సమయంలో కూడా అనేక మంది క్రిస్టియన్ సోదర, సోదరీమణులు ఎంతో మందికి సేవా కార్యక్రమాలను నిర్వహించారని గుర్తు చేశారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం, అదేవిధంగా పదిమందిని ఆదుకోవాలనే ఆలోచన, ప్రతి మనిషికి సేవ చేయాలనే తపన క్రైస్తవ మతంలో ఉందన్నారు.