
హైదరాబాద్ పరిధిలో ఎడతెరిపి లేకుండా వర్షం కరుస్తోంది. దీంతో పాతబస్తీలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గోడకూలి ఐదేళ్ల బాలిక జుబేదా మృతిచెందింది.ఘటనా స్థలాన్ని డిప్యూటీ మేయర్ పరిశీలించారు. మరోవైపు హైదరాబాద్ కమిషనర్ అంజన్‌కుమార్ పాతబస్తీలో పర్యటించారు. వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ నేపథ్యంలో హిమాయత్‌సాగర్ ప్రాజెక్టుకు ప్రమాదకర స్థాయిలో నీరు రావడంతో శనివారం సాయంత్రం అధికారులు 4 గేట్లు ఎత్తారు. వర్షం ఆగకపోవడంతో ఆదివారం ఉదయం మరో 8 గేట్లను ఎత్తారు. ప్రస్తుతం 12 గేట్ల నుంచి వరదనీరు కిందికి వెళ్తోంది.