Homeతెలంగాణ బ్రేకింగ్ న్యూస్బండి సంజయ్, అక్బరుద్దీన్ లపై కేసు నమోదు

బండి సంజయ్, అక్బరుద్దీన్ లపై కేసు నమోదు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ల పై ఎస్ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఇటీవల జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా హుస్సేన్ సాగర్ ఆక్రమణకు గురైందని, నెక్లెస్ రోడ్డులో ఉన్న పీవీ నరసింహారావు, ఎన్టీఆర్ సమాధులను కూల్చివేయాలని అన్నారు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్ గా ఈ సమాధులను కూల్చివేస్తే దారుస్సాలాంను కూల్చివేయడానికి సిద్ధంగా ఉన్నారని బండి సంజయ్ అన్నారు. ఈ వ్యాఖ్యలు శాంతి భద్రతలకు భంగం కలిగేలా ఉన్నాయని భావించిన పోలీసులు సాక్ష్యాధారాలను సేకరించి సుమోటాగా కేసు నమోదు చేశారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version