
హైదరాబాద్ నగరాభివృద్ధికి బీజేపీ కార్పొరేటర్లు సహకరిస్తారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. శుక్రవారం బీజేపీ కార్పొరేటర్లతో కలిసి ఆయన చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనానికి వచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ ను టీఆర్ఎస్, ఎంఐఎం విముక్త నగరంగా మారుస్తామన్నారు. ఎంఐఎంకు వ్యతిరేకంగా శివాజీలా పోరాడుతామన్నారు. ఒక వర్గం కోసం మెజార్టీ ప్రజలను అధికార పార్టీ అవమానిస్తుందన్నారు. పాతబస్తీలో ఎందుకు అభివ్రుద్ధి జరగలేదో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు.