
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై తెలంగాణ ప్రభుత్వ విఫ్ బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పక్కరాష్ట్రంలో దేనికి పనికి రాని వ్యక్తితో, హైదరాబాద్ రాజకీయాలు అంటే ఎంటో తెలియని వ్యక్తితో బీజేపీ పొత్తు ఎందుకో అర్థం కాలేదన్నారు. అన్ని పథకాలు మావే అన్న కేంద్రం 30 ఏళ్ల లోపు కేంద్రం ఉద్యోగులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. బండి సంజయ్ బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడు. ఆ హోదాకు తగ్గట్టుగా వ్యవహరించాలన్నారు. ప్రతిపక్షాలు టీఆర్ఎస్పై విమర్శలు మానుకొని అభివ్రుద్ధిపై మాట్లాడాలని అన్నారు. టీఆర్ఎస్ ప్రకటించి టికెట్లలో 50 శాతానికి పైగా డిగ్రీ పూర్తి చేసిన వారు ఉన్నారని, ప్రతిపక్షాల మాటలు కామెడీ షోలా ఉన్నాయని పేర్కొన్నారు.