
గుజరాత్ లో ఘోర ప్రమాదం జరిగింది. సురేంద్రనగర్ జిల్లా పట్టి అనే ప్రాంతంలో శనివారం ఉదయం ట్రక్కు, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద తీరును పరిశీలించారు. ప్రమాదంలో ట్రక్కు, కారు రెండూ దెబ్బతినడంతో ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. అయితే ట్రక్కు డ్రైవర్ పరారయ్యడు. కాగా రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. మూడురోజుల కిందట జరిగిన రోడ్డు ప్రమాదంలో 11 మంది దుర్మరణం చెందారు. తాజాగా ఏడుగురు మరణించడం ఆందోళన వాతావారణం నెలకొంది.