
తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని ఓ వధువు ‘100’కు డయల్ చేసింది. మరికొద్ది క్షణాల్లో తాళికట్టే తంతువు జరగాల్సి ఉండగా పోలీసులు రంగ ప్రవేశం చేసిన ఇష్టం లేని పెళ్లి చేయద్దని చెప్పడంతో పెళ్లి ఆగిపోయింది. అయితే చుట్టపు చూపుకొచ్చిన ఓ యువతి ఈ పెళ్లికి ఒప్పుకోవడంతో వివాహ కార్యక్రమం జరిగింది. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గుండెపూడికి చెందిన యువకుడికి, కురవి మండలం కాంపెల్లికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. అయితే ఈ వివాహం ఇష్టం లేని ఆ యువతి సరిగ్గా తాళికట్టే సమయానికి పోలీసులకు 100 ద్వారా ఫోన్ చేసి చెప్పింది. దీంతో పోలీసులు ప్రవేశం చేసి పెళ్లికి యువతనిని ఒప్పించే ప్రయత్నం చేశారు. కానీ యువతి ఒప్పుకోకపోవడంతో వరుడి తల్లిదండ్రులు చుట్టాల అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు.