
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా ఆయా పార్టీల నేతల మాటలు తూటాలను పేల్చే విధంగా మారుతున్నాయి. ఎంఐఎం పార్టీకి చెందిన ఎమ్మెల్యే మహ్మద్ ఖాన్ ఇప్పటికే ‘ మేం తలుచుకుంటే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం’ అని అన్నారు. అలాగే మరో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ నెక్లెస్ రోడ్డులోని ఎన్టీఆర్, పీవీ నరసింహారావు సమాధులను కూల్చేయాలన్నారు. తాజాగా ఎంఐఎంకు చెందిన మరో ఎమ్మెల్యే మౌజమ్ ఖాన్ శుక్రవారం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘కరెంట్ బిల్లలు కట్టే అవసరం లేకుండా ఉండాలంటే ఎంఐఎంకు ఓటెయ్యండి ’ అని అన్నారు. కరెంట్ బిల్లులు, నల్లా బిల్లులు ఎవరూ కట్టొద్దన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై పలు విమర్శలు వస్తున్నాయి.