
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదివారం హైదరాబాద్ కు రానున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనున్నందున ఆయన చివరి రోజు బీజేపీ తరుపున ప్రచారంలో పాల్గొంటరాు. 10.45 గంటలకు చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్ లో ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆ తరువాత 11.30 గంటలకు వారాసి గూడ చౌరస్తా నుంచి సీతాఫల మండి హనుమాన్ మందిర్ వరకు రోడ్ షోలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు లంచ్ చేయనున్నారు. అనంతరం పార్టీ నాయకులతో సమావేమవుతారు. ఇప్పటికే కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ తరుపున ప్రచారం చేశారు. నిన్న ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ ప్రచారం చేశారు. నేడు అమిత్ షా రాకతో బీజేపీ నేతల్లో ఉత్సాహం నెలకొంది.